MENU

Where the world comes to study the Bible

బైబిల్ సిద్ధాంతము: దేవుడు

 

I. మనము దేవుని గూర్చి ఎలా తెలుసుకోగలము?

.సాధారణ ప్రత్యక్షత ద్వారా

1. ప్రకృతి సంబంధమైన లోకము దేవుని గూర్చి తెలియజేస్తుంది అ.కా 14:15-17; రోమా 1:19- 23

2. మనస్సాక్షి దేవుని గూర్చి తెలియజేస్తుంది రోమా 2:14-16

బి. ప్రత్యేకమైన ప్రత్యక్షత ద్వారా

1. అద్భుతాలు దేవుని గూర్చి తెలియజేస్తాయి

. ఆయన ప్రకృతి ధర్మాలను పొడిగించినపుడు యేహోషువ 10:12-14 సూర్యుడు నిలిచిపోయెను

బి. ప్రకృతి ధర్మాలను మార్చినపుడు 2 వ రాజులు 6 గొడ్డలి తేలినపుడు

2. ప్రవచన నేరవేర్పు ద్వారా

.పాతనిబంధన యెషయ 43:28-45; ఎజ్రా 1:1-4 కోరేషు గూర్చి

బి. క్రొత్తనిబందన మీకా 5:2; మత్తయి 2:1 యేసు క్రీస్తు జన్మ స్థలము

3. యేసుక్రీస్తు ద్వారా హెబ్రియులకు 1:1 యోహాను 1:8

4. లేఖనాలన్నీ దేవుని ప్రత్యక్షపరుస్తాయి

II. దేవుని ఉనికిని (existence) ఋజువు చేయగలమా ?

. బైబిల్ దేవుని ఉనికిని ఋజువు చేయడం కంటే ఆయన ఉన్నాడని నమ్ముతుంది .కా 1:1

బి. ప్రకృతి లోకము దేవుని అస్తిత్వాన్ని కోరుకుంటుందని బైబిల్ తెలియజేస్తుంది కీర్తన 19; యెషయ 40:20; .కా 14:17; రోమా 1:19

సి. దేవుని ఉనికిని గూర్చి సందేహిస్తున్న వారికి సహాయకరంగా కొన్ని తత్వ సంబంధమైన ఋజువులు కలవు. వీటి తర్కాలు లేఖనాలలో కూడా చూడగలము

1. విశ్వ నిర్మాణ శాస్త్రానికి సంబంధమైన వాదన ( Cosmological argument) – కలుగాజేయబడినది ఏదయినా (cause) కలిగించినవాడు లేకుండా ఎలా వుంటుంది? కలిగించినది ఎవరు ? రోమా 1:20

2. రూపకల్పన సిద్ధాంతం (Teleological argument) – నిర్మించిన వాడు లేకుండా ప్రపంచములో నిర్మాణమైనా వుండునా ? కీర్తన 19:1-6

3. నైతిక వాదన (Moral argument) – నైతిక విలువలు ఇచ్చినవాడు లేకుండా ప్రజలు ఎందుకు మంచి, చెడులను దృష్టిస్తారు ? రోమీ 2:14, 15 యాకోబు 4:12

4.తర్క వాదన (Ontological argument) – దేవుడు తెలియజేయకుండా ప్రజలకు ఏవిధంగా పరిపూర్ణ మైన వ్యక్తి (దేవుడు) గూర్చి తెలుస్తుంది ? అ.కా 17:27; రోమా 1:19

III. మనము దేవుని ఏవిధముగా వివరించగలం?

దేవునికి అనేక పరిపూర్ణ గుణ లక్షణాలు వున్నాయి

. దేవునికి మాత్రమే వుండే గుణ లక్షణాలు (incommunicable attributes)

1. స్వయంభవుడు self-existence యోహాను 5:26

2. మార్పులేనివాడు immutability కీర్తన 102:25-27; నిర్గమ 3:14; యాకోబు 1:17 – దేవుడు తన యొక్క ప్రణాళికను లేదా తనను మార్చుకొనడు.

3. అనంతమైన వాడు infinity

. నిత్యత్వం eternity- అనతమైన కాలము కీర్తన 90:2

బి. సర్వవ్యాపి omnipresent – విశ్వంలో అనంతమైనవాడు కీర్తన 139:7-11

4. పరిశుద్ధుడు holiness – చెడులేకపోవడం మరియు పవిత్రత కలిగి వుండడం లేవి 11:44; యోహాను 17:11

బి. దేవుని నుండి సంక్రమింప గల గుణ లక్షణాలు (Communicable attributes) ఈ గుణ లక్షణాలు స్వల్ప పరిణామంలో మనుష్యులలో కనుగొనగలము.

1. జ్ఞాన సంబంధమైన గుణగణాలు. (attributes of intellect)

. సర్వజ్ఞాని (Omniscience) – దేవునికి అన్ని విషయాలు వాటి వాస్తవికత మరియు వాటి సామర్ధ్యము తెలియును కీర్తన 139:16; మత్తయి 11:21

బి. సమస్తాన్ని ఎరిగినవాడు (All-wise) – దేవుడు తన జ్ఞానంతో నిత్యమైన మేలును కలుగజేస్తాడు

2. భావోద్రేకాలకు సంభందించిన గుణగణాలు(attributes of emotion)

. ప్రేమామయుడు God is love – దేవుడు మనము అర్థము చేసుకోలేనంతగా మనకు మేలు కలుగజేస్తాడు 1యోహాను 4:8

బి. కృప Grace – అర్హత లేకున్నా కృప చూపిస్తాడు ఎఫేసి 2:8

సి. కనికరము Mercy – భారము కలిగియుండుట , కరుణ కలిగి ఉండుట యాకోబు 5:11

డి. దీర్ఘశాంతము Longsuffering – కోపము పుట్టించినను తనను శాంతపరచుకోగలడు 2 పేతురు 3:9, 15

. న్యాయవంతుడు God is Just – దేవుడు మానవునితో గల సంభంధాలలో పరిపూర్ణముగా నీతిమంతుడు కీర్తన 19:9

3. చిత్తానికి సంబంధించిన గుణగణాలు (attributes of will)

. సర్వశక్తి Omnipotence యోబు 42:2 దేవుడు తన చిత్తము చొప్పున ఏదైనా చేయగలడు. ఆయన తన స్వభావమునకు విరుద్ధంగా (పాపము) ఏదీ చేయడు

బి. సార్వభౌమత్వం Sovereignty 2దిన.వృ 29:11, 12 అంతిమ ఆధికారము దేవునిదే. ప్రపంచములోని అన్నిటిని పాలించేవాడు. ఆయన కొన్నిటిని ప్రకృతిపరంగా జరగడానికి అంగీకరిస్తాడు. వాటికీ ఒక స్థలాన్ని నియమిస్తాడు.

IV. దేవునికి గల నామములు

దేవుని నామములు ఆయన ఎవరు ? ఏమి చేస్తాడు ? అని తెలియజేస్తాయి .

. ఎలోహిం - పేరు ఆయన యొక్క శక్తి, పరిపాలన అధికారాన్ని సూచిస్తుంది ఆది.కా ; యెషయ

బి. ఎల్షధై - పర్వతము మీద వున్న దేవుడు - బలము, నియంత్రణ మరియు ఓదార్పు ఆది.కా ; కీర్తన

సి. అదోనై- ఆయన ప్రభువు , యజమాని అని తెలియజేస్తుంది. యేహోషువ

డి. యెహోవా- నేనుఆయన మార్పులేనివాడని స్వయంభవుడని తెలియజేస్తుంది ని.కా

1. యెహోవాఈరే యెహోవా చూచుకొంటాడు ఆది.కా

2. యెహోవారాఫా స్వస్థపర్చు యెహోవా

3. యెహోవా-నిస్సి యెహోవా నా ద్వజం ని.కా

4. యెహోవా-షాలోం యెహోవా నా సమాధానం యుదా

5. యెహోవా-రాహ్ యెహోవా నా కాపరి కీర్తన

6. యెహోవా-సిద్కెను యెహోవా మనకు నీతి యిర్మియా

7. యెహోవాషమ్మా యెహోవా వుండు స్థలం యెహజ్కేలు

8. యెహోవాసాబ్బోత్ సైన్యములకదిపతియైన యెహోవా 1 సమూయేలు

V. దేవుడు రూపంలో ఉంటాడు?

. దేవుడు వ్యక్తి స్వరూపి. దేవుడు మానవుడు కానప్పటికిని మానవుని వలె జ్ఞానము, భావోద్రేకాలు మరియు చిత్తాన్ని కలవాడు. విధంగానే మనము ఆయన స్వరూపము కలిగియున్నాము అని చెప్పగలము (ఆది.కా ). ఆయనకు మనలోని అసంపూర్ణత లో పాలులేదు కాని మనకు వాలె వ్యక్తిత్వాన్ని పంచుకుంటాడు. ఆయన ఒక శక్తి కాదు. ఆయన వ్యక్తి స్వరూపి.

బి. దేవుడు ఆత్మ స్వరూపి. దేవుడు ఏవిధమైన భౌతిక పదార్ధము వలన చేయబడలేదు. ఆయన ఆత్మ (యోహాను 4:24). ఆయనకు శరీరము లేదు.

సి. దేవుడు త్రియేకత్వము. దేవుని యొక్క మూడు విధాలను త్రిత్వము వివరిస్తుంది . కాని అది కొంతవరకే . దేవుడు ఒక్కడే . ఆయన ఏక రీతిగా వున్నవాడు . త్రిత్వము అనగా త్రిఏకత్వము అని మనము అర్ధము చేసుకోవాలి .

డి. నిర్వచనము - There is only one God but in the unity of God there are three equally eternal persons , the same in substance but distinct from each other. దేవుడు ఒక్కడే కాని దేవుని ఏకత్వంలో ముగ్గురు సమానమైన నిత్యత్వం గల మనుష్యులు (వ్యక్తులు) ఒకే సారాంశం కలిగిఉన్నను ఒకరికొకరు విలక్షణమైయున్నారు (B.B. Warfield నుండి తీయబడినది )

1. తప్పులు (తిత్వాన్ని ఖండించేవి)

a. దేవుడు ఒక్కడే కాని 3 స్వభావాలు , రూపాలు లేక లక్షణాలు లేవు

b. మూడు విభిన్నమైన దేవుళ్ళు కారు

c. కుమారుడు మరియు పరిశుద్ధాత్మ దేవుని కంటే తక్కువ లేక దేవునిచే సృష్టింపబడిన వారు కారు

2. దేవుని యొక్క ఏకత్వము

a. దేవుడు ఒక్కడే (ద్వితి.కా 6:4; యెషయ 45:14; యాకోబు 2:19) – ఒక పరిపూర్ణమైన వ్యక్తి మాత్రమే ఉండగలడు. వారు ఇద్దరిగా ఉండినచో వారు విభిన్నంగా వుండరు మరియు వారు ఏకమై వుంటారు.

b. ఒక్క దేవుడు భాగాలుగా విభజింపబడడు .- దేవుడు స్వభావరీత్యా ఆత్మ కనుక ఆయన భౌతికంగా అవిభక్తనీయుడు. ఆయన 3 భాగాలుగా విభజింపబడి 1/3 భాగపు దేవుడుగా వుండడు. తండ్రియైన దేవుడు కుమారుడైన దేవుడు మరియు పరిశుద్ధాత్మ దేవుని నుండి మరి దేని నుండియు వచ్చియుండడు .

3. దేవుని యొక్క త్రిత్వము : ముగ్గురు వ్యక్తులు దేవుడు గుణగణాలయితే కలిగియున్నాడో వాటినే కలిగియున్నారు . కనుక ప్రత్యేకముగా దేవునిగా పిలువబడుచున్నారు .

a. తండ్రియైన దేవుడు.

రోమా 1:7- దేవుడు మనకు తండ్రి

యోహాను 6:27 తండ్రియైన దేవుడు

b. కుమారుడైన దేవుడు

1. దేవునికి మాత్రమే వుండే లక్షణాలు కలిగి వున్నాడు

a. ఉనికి (హెబ్రీ 7:3; యోహాను 5:26)

b.మార్పులేనివాడు (హెబ్రీ 1:10; 13:8)

c. అనంతమైనవాడు

d. నిత్యుడు (హెబ్రీ 7:3)

e. సర్వవ్యాపి (మత్తయి 28:20)

2. దైవత్వము యొక్క కార్యాల్లో పాల్గొనుచున్నాడు

a. లోకాన్ని సృష్టించాడు (యోహాను 1:13)

b. లోకాన్ని జరిగించుచున్నాడు (కొలస్సి 1:15-17)

c.పాపాలను క్షమిస్తున్నాడు (మత్తయి 9:12)

d .ఆయన అంతిమ తీర్పును తీరుస్తాడు (యోహాను 5:22; ప్రకటన 19:16)

3. ఆయన ఆరాధింపబడుచున్నాడు

a. దూతలచే (హెబ్రీ 1:6; ప్రకటన 5:12, 13)

b. మనుష్యులచే (యోహాను 9:38; 20:28; మత్తయి 28:9)

4. ఆయనకు దైవిక బిరుదులు కలవు

a. యెహోవా (లూకా 2:11; 5:8)

b. దేవుని కుమారుడు (లూకా 1:35; యోహాను 5:18)

5. యేసు దేవునిగా claim చేసుకున్నాడు (యోహాను 5:18; 8:24; 28, 10:30-33)

6. ఇతరములైన క్లెయిమ్స్ (యోహాను 1:1;రోమా 9:5; 1 యోహాను 5:20)

ఇవియుగాక 4 వాక్యభాగాలు వ్యాకరణ రీతిలో యేసుక్రీస్తు దేవుడని ఋజువుచేయుచున్నవి 2 దేస్స 1:12; 1 తిమోతి 5:21; తీతు 2:13; 2 పేతురు 1:1.

c. పరిశుద్ధాత్మ దేవుడు

1. Explicit claims బహిర్గతమైనవి 2 కొరింది 3:17, 18

2. దైవికనామాలు మరియు బిరుదులు

a. యెహోవా (Yahweh) యెషయ 6:1-13 లోని యెహోవా అ.కా 28:25

b. అత్మదేవుడు (రోమా 8:9, 14; 1 కొరింది 2:11; 12:3; ఎఫెసి 4:30)

3. ఆయన మార్పు లేని లక్షణాలు కలిగియున్నాడు

a. ఉనికి రోమా 8:2 self-existence

b. సర్వవ్యాపి కీర్తన 139:7 omnipresence

4. దేవుడు మాత్రమే కలిగియుండే లక్షణాలు

a. సృష్టి ఆ.కా 1:2

b. పునరుద్ధానము రోమా 8:11

5. Implicit claims అంతర్గమైనవి

a. అ.కా 5:3, 4 – ఆత్మకు అసత్యము చెప్పుట దేవునితోఅసత్యము చెప్పుటే

b. 2 కొరింది 3; 17 – దేవుడు ఆత్మయై వున్నాడు .

4. దేవుని యొక్క త్రియేకత్వము

a. పాతనిబంధన ఋజువులు

1. దేవుడు బహువచన సర్వనామాలను ఉపయోగించాడు ఆ.కా 1:26; 3:22;11:7; యెషయ 6:8 బహువచన క్రియలు ఆ.కా 1:26; 11:7

2. ‘ దేవుని దూత ‘ అనగా కొన్నిసార్లు స్పష్టముగా దేవుని గురించి చెప్పబడినను దేవునికి (తండ్రి) విభిన్నంగా కనపడును. కావున క్రీస్తును తన మానవావతారానికి ముందుగా చూడగలము . ఆ.కా 16:7 – 13; 18:1-21 ; 19:1 – 28; మాలకి 3:1

3. కొన్ని వాక్యభాగాలు దైవత్వము యొక్క వ్యక్తులను ( తండ్రి ,కుమార , పరిశుద్ధాత్మ) స్పష్టముగా ప్రత్యేకంగా వివరిస్తాయి . యెషయ 48:12, 16; కీర్తన 110:1 ప్రభువు /ప్రభువు

b. క్రొత్తనిబందన ఋజువులు

1. దేవుడు “ఒక్కడే “ ఎఫేసి 4:6; యాకోబు 2:19

2. దేవుడు “ముగ్గురు” మత్తయి 3:16; 1 కొరింధీ 12:4-6; 1 పేతురు 1:2

3. దేవుడు “త్రిత్వము “ మత్తయి 28:19

5. సారాంశం : “త్రిత్వము” (త్రియేకత్వము) అను సిద్దాంతము “తెలుసుకోవలసినది “ మరియు “నమ్మవలసినది “ కాని పూర్తిగా మానవజ్ఞానానికి లేక మానవమాటలతో “వివరించలేనిది”. త్రిత్వము ఏవిధంగా వున్నది దాని నిర్మాణము మరియు కార్యాలు మనకు క్రీస్తు యేసు యొక్క అవతారము ఎట్లు జరిగిందో (యేసు దేవుడు మరియు మానవుడు ) అట్లే అతీతమైనది . దేవుడు ఒక్కడే అని మనకు తెలుసు . ఆయన ముగ్గురు అని కూడా తెలుసు . అందుచే మనము త్రిత్వాన్ని సత్యముగా ఎంచుతాము.

ప్రయోగాత్మకంగా క్రీస్తును వెంబడించే వారికీ మాత్రమే త్రిత్వమైన దేవుని యొక్క అవసరము తెలియును .

a. పరిపూర్ణమైన బలిగా దేవుని కుమారుడు మాత్రమే మన పాపానికి పరిష్కారము చెల్లించగలడు. యోహాను 3:16

b. ఆత్మ దేవుడు మాత్రమే మనలో నివసించగలడు. యోహాను 14:16, 17

c. తండ్రి యైన దేవుడు మాత్రమే అటువంటి ప్రణాళికను నేరవేర్చగలడు.

 

Sid Litke ,Th.M, 1984 లో డల్లాస్ థియలాజికల్ సెమినరి నుండి పట్టభద్రులయ్యారు .ఆయన ప్రస్తుతము Open Door Bible Church, Washington,Wisconsin లో పరిచర్య చేయుచున్నారు

 

Translated by Ruth Vinay, ruth_melody AT yahoo.com

Related Topics: Theology Proper (God)

Report Inappropriate Ad